Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండలో రైతు ఇంట్లో రూ.45 లక్షల నగదు చోరీ

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:41 AM అనంతపురంGeneral
ఉరవకొండలో రైతు ఇంట్లో రూ.45 లక్షల నగదు చోరీ - Udayam
అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని లత్తవరం గ్రామ పొలాల్లో రైతు మాదినేని శ్రీనివాసులు ఇంట్లో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో నవంబరులో జరగనున్న కొడుకు పెళ్లి, ఇంటి నిర్మాణానికి ఉంచిన రూ.45 లక్షల నగదును దొంగలు అపహరించుకెళ్లారు. బాధితులు బళ్లారికి వెళ్లిన సమయంలో, అప్రకటిత విద్యుత్ కోతను ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దురాగ్యానికి పాల్పడ్డారు.

Comments

G
Loading comments...