Back to feed
ఉత్కంఠ రేపుతోన్న ‘రిస్క్’ ట్రైలర్
Anjali Joshi May 31, 2026 2:43 AM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'రిస్క్' చిత్ర ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదలైంది. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ అని హీరో సందీప్ తెలిపారు. ప్రథమార్థంలో లవ్, కామెడీ, ద్వితీయార్థంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...



