వార్తలకు తిరిగి వెళ్లండి

'మండాడి’ విజయంతో హీరోగా సూరి మార్కెట్ పెరిగిందని, తదుపరి సినిమాకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
2015 చెన్నై వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రూ.50 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.
Comments
Loading comments...

