Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:00 PM అనకాపల్లి General
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - Udayam
అనకాపల్లిలో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమస్యలను ఈ నెల 10వ తేదీలోగా పరిష్కరించాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, సంక్షేమం, పదోన్నతులు కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఎస్.అప్పలరాజు, ఎరకయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...