వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్యాపిలి మండలంలో వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని సీపీఐ మండల కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భారతి కి వినతిపత్రం అందజేశారు.
పేదల భూ సమస్యలను పరిష్కరించి పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు అందించాలని కోరారు. సీపీఐ నాయకులు మనోహర్, మధు, రవి, కరీముల్లా, దస్తగిరి హెచ్చరించారు.
Comments
Loading comments...

