వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 40కి పైగా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం నేపథ్యంలో తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, హంగు ఆర్భాటాలతో యాజమాన్యాలు ప్రవేశాలు చేపడుతున్నాయి.
అక్రమ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. అనుమతుల పేరిట అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్న ఇలాంటి పాఠశాలల పట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

