Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్‌

Follow Udayam on Google
Rohit Verma May 22, 2026 3:02 PM జాతీయంGeneral
ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్‌ - Udayam
దిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖాలిద్‌కు దిల్లీ హైకోర్టు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. శస్త్రచికిత్స చేయించుకోనున్న తన తల్లిని కలిసేందుకు జూన్‌ 1 నుంచి కోర్టు ఈ అనుమతిని ఇచ్చింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉండాలని, ఆస్పత్రిలోని తల్లిని తప్ప మరెవరినీ కలవకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో పాటు అతనిపై కఠిన నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించింది.

Comments

G
Loading comments...