వార్తలకు తిరిగి వెళ్లండి
ఉక్రెయిన్‌లోని కోమిషువాకాపై రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 26 మంది మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. 3,000 కిలోల బరువున్న తొమ్మిది బాంబులతో దాడి చేసినట్లు తెలిపారు.
మానవతా సాయం అందిస్తున్న పాఠశాల, ఆశ్రయ కేంద్రాన్ని రష్యా లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. దాడిలో భవనాలు నేలమట్టమైన దృశ్యాలను విడుదల చేశారు.
Comments
Loading comments...

