వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నారు.
రెండో వేతన సవరణ సంఘం అమలు, ఆరు డీఏల విడుదల, బకాయి బిల్లుల చెల్లింపు, పాత పింఛను విధానం పునరుద్ధరణ, ఆరోగ్య పథకం సమర్థ అమలు తదితర డిమాండ్లపై నిరసన చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

