వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కన్వీనర్ వంటేపాక యాదగిరి, కో-కన్వీనర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

