Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష: సీఈవో సుదర్శన్ రెడ్డి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 11, 2026 12:01 PM హైదరాబాద్General
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష: సీఈవో సుదర్శన్ రెడ్డి - Udayam
ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే చట్టప్రకారం ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తామని తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. డీసీఈ సాఫ్ట్‌వేర్ ద్వారా రెండు చోట్ల ఉన్న ఓట్లను గుర్తిస్తామన్నారు. ఓటర్ల జాబితా శుద్ధి కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ప్రతిఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం నింపాలని, నింపిన వారి పేర్లే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...