Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Follow Udayam on Google
సందీప్ Jul 11, 2026 12:00 PM నిర్మల్ General
ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా - Udayam
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసిల్దార్ రాజు, అధికారులు స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...