వార్తలకు తిరిగి వెళ్లండి
కారు ప్రమాదంలో ఇద్దరు కరీంనగర్ వాసుల మృతి
రూపేష్ గౌడ్ Jun 28, 2026 8:32 AM కరీంనగర్ 3 viewsabout 1 hour ago

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తున్న కారు అదుపుతప్పి డ్రైనేజీ గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కరీంనగర్‌కు చెందిన కళ్లెం శ్రీనివాస్, తూర్పాటి భార్గవ్‌లుగా పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...