Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీసీల్లో చదివితే కొలువు గ్యారంటీ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 28, 2026 12:20 PM ఆదిలాబాద్General
ఏటీసీల్లో చదివితే కొలువు గ్యారంటీ - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలు (ATC) అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఆధునీకరించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 100 మంది విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో 99 మంది ప్రముఖ బహుళజాతి సంస్థల ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు. రూ.2.20 లక్షల నుంచి రూ.2.80 లక్షల వార్షిక వేతనంతో టాటా మోటార్స్, ఫాక్స్‌కాన్, ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీల్లో వీరు ఎంపికయ్యారు. ఈ విజయాలపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. త్వరలోనే వరంగల్, కరీంనగర్‌లలోనూ మెగా జాబ్ మేళాలు నిర్వహించనున్నారు

Comments

G
Loading comments...