వార్తలకు తిరిగి వెళ్లండి

భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి (పీవీ ఘాట్) వద్ద ఆదివారం ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పీవీ సమాధి వద్ద పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసి, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతగా పీవీ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ రాజకీయ నాయకుడు కే. కేశవరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Comments
Loading comments...

