Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని పురపోరు.. కూటమిలో సీట్ల పంచాయితీ

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:45 AM కాకినాడGeneral
తుని పురపోరు.. కూటమిలో సీట్ల పంచాయితీ - Udayam
తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో గందరగోళం నెలకొంది. 36 వార్డుల్లో ఏ వార్డు ఎవరికనే స్పష్టత లేకపోవడంతో టీడీపీ, జనసేన ఆశావహులు పోటీపడి 149 నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వార్డుల్లో ప్రచారం మొదలై సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటేయాలని కోరుతుండటంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే అసలు పోటీపై స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...