వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని తుమ్మచేనుపల్లె పంట పొలాల్లోకి వరుసగా రెండో రోజు ఒంటరి ఏనుగు ప్రవేశించింది. అర్ధరాత్రి గ్రామానికి చెందిన సిద్ధమ్మ పొలంలోకి వచ్చిన ఏనుగు వరి పంటను తొక్కి నాశనం చేసింది.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగు సంచారంతో పంటలకు నష్టం జరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ వెంటనే స్పందించి దానిని పొలాల నుంచి తరిమేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

