Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ట్యాంకర్‌ హైజాక్‌.. భారత నావికుడి మృతి

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 3:54 PM అంతర్జాతీయంGeneral
ట్యాంకర్‌ హైజాక్‌.. భారత నావికుడి మృతి - Udayam
సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన ‘ఎంటీ హానర్‌ 25’ ఇంధన నౌకలో ఐదుగురు సిబ్బంది హతమయ్యారు. మృతుల్లో ఓ భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఓ మయన్మార్‌ జాతీయుడు ఉన్నారు. మరో భారతీయుడు సహా నలుగురు గాయపడ్డారు. పుంట్‌ల్యాండ్‌ తీరంలో భద్రతా అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 16 మంది అనుమానిత పైరేట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...