వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన కల్లటి సమీపంలోని కొండవాలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని కొండలు, జాలువారే జలపాతాలతో ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తోంది.
సెలవు రోజుల్లో జలపాతాలను సందర్శించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
Comments
Loading comments...

