వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మార్కెట్ , బజారు రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు ప్రజలకు సూచించారు. ఆదివారం మార్కెట్లో పోలీస్ విజిబుల్ నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేయవద్దు అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

