Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్సుఫార్మరు ఏర్పాటుకు ఎమ్మెల్యే కు గ్రామస్థుల వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 6:20 PM విజయనగరంGeneral
ట్రాన్సుఫార్మరు ఏర్పాటుకు ఎమ్మెల్యే కు గ్రామస్థుల వినతి - Udayam
చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామ రైతులు శనివారం స్తానిక MLA కిమిడి కళా వెంకటరావును కలిసారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో తోటపల్లి కాలువ గట్టు వద్ద ఉన్న 63 KV డిస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయట్లేదని పిర్యాదు చేసారు. దీనివల్ల రైతులు సొంత నిధులతో బోర్లు కొట్టించుకుని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ మేరకు 100 KV ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసారు.

Comments

G
Loading comments...