Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ రాజేష్కు డబుల్ ధమాకా

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 5:10 PM విజయనగరంGeneral
టీచర్ రాజేష్కు డబుల్ ధమాకా - Udayam
నెల్లిమర్ల మండలంలోని చినమల్లుపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన రాజేష్కు తాజాగా రాష్ట్రస్థాయి అవార్డు కూడా వరించడం విశేషం. సాంకేతికత, ఏఐ ఆధారిత బోధనా విధానాలతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...