Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో రాజారాణి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇవ్వాలి

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:18 PM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో రాజారాణి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇవ్వాలి - Udayam
టెక్కలి రైల్వే స్టేషన్‌ను వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు సందర్శించిన సందర్భంగా బీజేపీ నాయకులు రాజారాణి ఎక్స్‌ప్రెస్‌కు టెక్కలిలో హాల్ట్‌ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే వైద్యం, విద్య, ఉద్యోగాలు, అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. టెక్కలి ప్రాంత ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని హాల్ట్‌ మంజూరుకు చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...