వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా సరిగా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి విద్యుత్ అంతరాయంతో వైద్య సిబ్బంది సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే చికిత్స అందించారు.
చీకట్లో రోగులు అవస్థలు పడుతుండగా, సమస్య పరిష్కారానికి ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని రోగులు కోరారు.
Comments
Loading comments...

