వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతికూల వాతావరణం కారణంగా క్యాంప్ డేవిడ్‌లో జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని వైట్‌హౌస్‌కు మారుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశంలో అవుట్‌గోయింగ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌తో సహా క్యాబినెట్ సభ్యులందరూ పాల్గొనే అవకాశం ఉంది.
ఈ భేటీలో దేశీయ, విదేశీ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవస్థ, చిన్న వ్యాపారాల విజయాలు, ఇరాన్‌తో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక చర్చలు జరపనున్నారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

