Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 25, 2026 6:01 PM వరంగల్General
పరకాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలి - Udayam
పరకాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు చిరు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. పట్టణంలోని కూరగాయలు, చేపల మార్కెట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మార్కెట్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తామని, చేపల మార్కెట్‌కు ప్రత్యామ్నాయ స్థానం కేటాయిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...