వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి అమలాపురంలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తుండగా, మార్గమధ్యలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అమలాపురం రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

