వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం నుండి వస్తుండగా బొబ్బిలి బస్ స్టేషన్‌లో తప్పిపోయిన బాలికను, పార్వతీపురం మహిళా పోలీసులు చాకచక్యంగా తల్లి రజిని వద్దకు చేర్చారు. తల్లి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బందితో సమన్వయం చేసుకుని పాపను సురక్షితంగా రప్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు, ప్రయాణాల్లో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సకాలంలో స్పందించి బాలికను చేర్చిన పోలీసులను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

