వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల అజీజ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కూరగాయల కోసం తల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, కొత్త కాలువ వద్ద ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో అజీజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. కళ్లముందే కొడుకు మరణించడంతో తల్లి కన్నీరుమున్నీరైంది.
Comments
Loading comments...

