వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. డ్రైవర్‌తో సహా 13 మంది ప్రయాణిస్తున్న ఈ వాహన ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతివేగం లేదా నిద్రమత్తు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

