వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో కుప్పకూలిన ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన అకాల మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
'మిలానా', 'యు-టర్న్' చిత్రాలతో గుర్తింపు పొందిన దిలీప్, నిర్మాతగా పలు సీరియళ్లను రూపొందించారు. ఆయన మృతికి కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

