వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య నిర్మలతో పాటు, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, దామోదర్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
తమ చావుకు ఎవరూ కారణం కాదని దామోదర్ సూసైడ్ లేఖ రాశాడు. అంత్యక్రియల కోసం ఏటీఎం కార్డులో ఉన్న డబ్బులను వాడుకోమని అందులో కోరడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

