Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట కొత్త సీఐగా వినోద్ బాబు బాధ్యతలు

Follow Udayam on Google
Kumar Jun 22, 2026 3:36 PM అనకాపల్లి General
పాయకరావుపేట కొత్త సీఐగా వినోద్ బాబు బాధ్యతలు - Udayam
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎం. వినోద్ బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చింతపల్లిలో పనిచేసిన ఆయన, బదిలీల నేపథ్యంలో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తానని వినోద్ బాబు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...