వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో డీఆర్వో వెంకటనారాయణమ్మ పాల్గొని అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, దరఖాస్తుదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రీ-ఓపెన్ మరియు తప్పుదోవ పట్టే పరిష్కారాలను తగ్గించాలని డీఆర్వో సూచించారు. ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

