వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దశదిన కర్మకు వెళ్తున్న ఆటోను గ్రానైట్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుకొండలు, రమణమ్మ అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బాయమ్మ మృతి చెందారు.
మరో ఏడుగురు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

