వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై నీటి పైపులైన్ లీకేజీ కారణంగా సోమవారం మరమ్మతు పనులు చేపట్టారు. ప్రధాన లైనులో లీకేజీతో రహదారిపై నీరు వృథాగా ప్రవహిస్తుండటంతో, అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి పనులు మొదలుపెట్టారు.
ఈ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

