Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ దాడులు: 36 అక్రమ మద్యం కేసులు నమోదు

Follow Udayam on Google
Sadvika Jun 22, 2026 4:03 PM నెల్లూరుGeneral
ఎక్సైజ్ దాడులు: 36 అక్రమ మద్యం కేసులు నమోదు - Udayam
జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టారు. వారం రోజుల డ్రైవ్‌లో 36 కేసులు నమోదు చేసి, 280 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇబ్బందులు కలిగించిన 67 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Comments

G
Loading comments...