వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో పర్యాటక రంగం: 10 వేల హోంస్టేల లక్ష్యం

రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2024-29 పాలసీలో భాగంగా 'బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' విధానాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్లలో 10 వేల హోంస్టేలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
ఈ పథకం ద్వారా సుమారు 5 వేల కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, 20 వేల కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందనుంది. పర్యాటక శాఖ ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేసింది.
Comments
Loading comments...