Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టమోటా ధరల పతనం.. కిలో రూ.10 లోపే

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 28, 2026 3:01 PM అనంతపురంGeneral
టమోటా ధరల పతనం.. కిలో రూ.10 లోపే - Udayam
ఎన్నో ఆశలతో సాగు చేసిన టమోటా పంట చేతికొచ్చే సమయానికి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ఎగుమతులు మందగించడం, మార్కెట్లకు భారీగా దిగుబడి రావడంతో కిలో గరిష్ట ధర రూ.10 నుంచి రూ.12 మధ్యే పలుకుతోంది. దీంతో చేసేది లేక రైతులు పంటను తోటల్లోనే వదిలేయడం లేదా రోడ్లపై పారబోస్తున్నారు.

Comments

G
Loading comments...