Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 10:37 AM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు - Udayam Digital
శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా చిరుజల్లులు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపి, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...