వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు రోటరీ క్లబ్ ఎదురుగా ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఫొటోగ్రాఫర్ చోడవరపు బాలు కుటుంబంతో కలిసి ఈ నెల 13న విశాఖపట్నం వెళ్లి, శనివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
దుండగులు ఆరు గ్రాముల బంగారం, 12 తులాల వెండితో పాటు రూ.2 లక్షల విలువైన కెమెరాను అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

