Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్ళపల్లిలో కర్రీ కోసం వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 11:28 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్ళపల్లిలో  కర్రీ కోసం వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి - Udayam
తంగళ్లపల్లిలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన మోతె రాజుపై మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ గొడ్డలితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాత గొడవలను మనసులో పెట్టుకుని తన కుమారుడిపై దాడి చేశారని మోతె రాజు తల్లి ఆరోపించారు. ఈ ఘటనలో రాజుకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...