వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మున్సిపల్ 3వ వార్డులో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.కౌన్సిలర్లు రాగుల ప్రదీప్, సుంకేటి మమత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐదు నెలల గర్భిణికి శ్రీమంతం నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కవితారాణి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎం,ఆశా కార్యకర్తలు, గర్భిణులు,పాల్గొన్నారు.
Comments
Loading comments...

