వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి గ్రామపంచాయతీలోని మూడు, నాలుగు వార్డులలో ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో గురువారం సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
వర్షాలు కురిసిన సమయంలో ఇనుప స్తంభాలతో ప్రమాదాల ముప్పు ఉందని వార్డు సభ్యులు చేసిన వినతికి విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ శేఖర్ యాదవ్, ఉప సర్పంచ్ కోటీశ్వర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

