వార్తలకు తిరిగి వెళ్లండి
పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 2.5 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్థానిక యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్రమ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న యువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

