Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 12:17 PM తిరుపతిఆంధ్రప్రదేశ్
తిరుపతి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు - Udayam
తిరుపతి జిల్లాలో నీటిపారుదల రంగ అభివృద్ధికి రూ.957.30 కోట్లతో 10 ప్రధాన ప్రాజెక్టుల ప్రతిపాదనలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రభుత్వానికి పంపారు. తెలుగు గంగ 7వ బ్రాంచ్‌ కాలువ పనులకు రూ.31.28 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. పనులు పూర్తైతే 11,870 ఎకరాలకు సాగునీరు అందనుంది. స్వర్ణముఖి బ్యారేజీ–దుగరాజపట్నం కుడి కాలువకు రూ.3.79 కోట్లు, మోపూరు చెరువులకు రూ.1.52 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది.

Comments

G
Loading comments...