వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న గరుడవాహన సేవ జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 15 రాత్రి 9 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను టీటీడీ నిషేధించింది.
వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ స్థలాల్లో నిలిపి, ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. భక్తులు ఈ ఆంక్షలను గమనించి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

