వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గురువారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని 12 బైకులు, రూ.38 వేల నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిని తదుపరి విచారణ నిమిత్తం ఎల్‌ఎండీ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ సతీష్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు.
Comments
Loading comments...

