Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో పులి సంచారం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:08 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో పులి సంచారం  - Udayam
కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) రేంజ్‌ పరిధిలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్‌ ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. అటవీశాఖ సిబ్బంది ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...