Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీపట్నం మండలంలోకి పెద్దపులి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:59 PM అల్లూరి General
దేవీపట్నం మండలంలోకి పెద్దపులి - Udayam
దేవీపట్నం మండలంలోకి పెద్దపులి ప్రవేశించిందని ఇందుకూరు అటవీశాఖ రేంజ్‌ అధికారి కొండలరావు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు పులి ఫోక్స్‌పేట రేంజ్‌లో ఉన్నట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి కొత్తవీధి అటవీ ప్రాంత పరిసరాల్లో పులి ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం పులి ఏయే ప్రాంతాల్లో సంచరిస్తుందనే వివరాలను అటవీశాఖ అధికారులు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...